షాద్ నగర్ ఠాగూర్ పాఠశాల విద్యార్థి కిడ్నాప్

Wed,September 19, 2018 10:18 PM

10th class student kidnap at shadnagar tagore school

రంగారెడ్డి: షాద్ నగర్ ఠాగూర్ పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థి కౌశిక్ ను గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. కౌశిక్ తండ్రి వెంకటేశ్వర్ రావు బిఏఎం కళాశాలలో లెక్చరర్ గా పని చేస్తున్నారు. కౌశిక్ సాయంత్రం ట్యూషన్ ను ముగించుకుని వెళ్తుండగా ఇన్నోవా వాహనం నెంబర్ ఏపీ 22 ఈఈ 5201 లో కౌశిక్ ను దుండగులు ఎత్తుకువెళ్లినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ కిడ్నాప్ సంఘటనతో షాద్ నగర్ ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.

491
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS