గోదాముల నిర్మాణానికి 1,024 కోట్లు : హరీష్ రావు

Tue,November 14, 2017 10:55 AM

1024 crores allocates Godowns says Harish Rao

హైదరాబాద్ : రాష్ట్రంలో గోదాముల నిర్మాణానికి రూ. 1,024 కోట్లు ఖర్చు చేసినట్లు మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా గిడ్డంగుల నిల్వ సామర్థ్యం పెంపుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఇప్పటి వరకు 14.67 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్‌లను పూర్తి చేశామన్నారు. దీంతో గోదాముల సామర్థ్యం 22.4 లక్షల మెట్రిక్ టన్నులకు చేరిందన్నారు. మూడు లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్‌లను పౌరసరఫరాలు, హాకాకు అప్పగించామని తెలిపారు. కాటన్ కార్పొరేషన్ ఆప్ ఇండియాకు మన గోడౌన్లనే ఇస్తున్నామని గుర్తు చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలోప్రభుత్వ గోడౌన్‌లు ఖాళీగాపెట్టి ప్రయివేటు గోడౌన్లలో మెటీరియల్ పెట్టేవారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన ప్రభుత్వ గోడౌన్లను అభివృద్ధి చేసి.. ప్రభుత్వ గోడౌన్లను నింపిన తర్వాతే.. ప్రయివేటు గోడౌన్లను నింపుతున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ గోదాముల్లోనే సామాగ్రి ఉంచేందుకు నోడల్ ఏజెన్సీ నియమించామని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో డిమాండ్ ఆధారంగా గోదాముల నిర్మాణంపై యోచిస్తామని చెప్పారు. రైతు బంధుపథకం కింద 1651 మంది రైతులకు రూ. 20 కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. ఖమ్మంలో పండ్ల మార్కెట్ కు స్థలం ఇస్తే గోదాము నిర్మాణంపై ఆలోచిస్తామని మంత్రి చెప్పారు. 150 కోట్లతో కొత్తగా గోడౌన్లను నిర్మించామని తెలిపారు. పారదర్శకంగా టెండర్ల నిర్వహణతో రూ. 150 కోట్లు ఆదా అయ్యాయని మంత్రి హరీష్‌రావు చెప్పారు.

1433
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS