తాగి వేధించాడు..నెల రోజులు జైలు శిక్ష

Thu,December 5, 2019 08:17 AM


మెహిదీపట్నం : మద్యం మత్తులో భార్యను వేధింపులకు పాల్పడిన భర్తకు కోర్టు నెల రోజుల జైలుశిక్ష, రూ.100 జరిమానా విధించినట్లు హబీబ్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ శివచంద్ర తెలిపారు . మల్లేపల్లి కట్టమైసమ్మ దేవాలయం సమీపంలోని బస్తీలో నివసించే భాస్కర్‌ (37) రోజూ తాగి వచ్చి భార్య మాధవిని వేధిస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు భాస్కర్‌ను పోలీస్‌స్టేషన్‌ తీసుకెళ్లగా..అక్కడ పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడు. దీనిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి..బుధవారం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు నిందితుడికి నెల రోజుల జైలు శిక్ష, రూ.100 జరిమానా విధించింది.

638
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles