డిగ్రీ కళాశాలల్లో 1.41 లక్షల మంది చేరిక...

Sun,June 17, 2018 06:50 AM

1.41 lakh people Joined in degree colleges in telangana

హైదరాబాద్ : రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు పారదర్శకంగా కొనసాగుతున్నాయి. నాణ్యమైన డిగ్రీ కాలేజీల్లో విద్యార్థులు చేరేందుకు ప్రభుత్వ తీసుకున్న చర్యలు ఫలిస్తున్నాయి. డిగ్రీ ఆన్‌లైన్ సిస్టం ఆఫ్ తెలంగాణ (దోస్త్) ద్వారా ప్రవేశాల ప్రక్రియ పకడ్బందీగా కొనసాగుతున్నది. ఈ నెల నాలుగున దోస్త్ తొలివిడుతలో 1.41 లక్షల మంది విద్యార్థులు సీట్లు పొందారు. వారిలో 84 వేల మంది కాలేజీల్లో చేరినట్టు ఆన్‌లైన్ కన్ఫర్మేషన్‌ను ఇచ్చారని దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి చెప్పారు.

రెండో విడుత కౌన్సెలింగ్ కోసం కొత్తగా మరో 45 వేల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తొలి విడుత వెబ్ కౌన్సెలింగ్‌లో ఆప్షన్ ఇచ్చిన వారికి రెండోవిడుత కౌన్సెలింగ్‌లో పాల్గొని ైస్లెడింగ్ కావడానికి అధికారులు అవకాశం ఇచ్చారు. పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన డిగ్రీ కాలేజీల్లో సీట్లు కేటాయించారు. ఇందులో క్యాటగిరీలవారీగా రిజర్వేషన్ల విధానం అమలుచేశారు.

దీంతో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల సంఖ్య కూడా బాగా పెరిగిందని, ఈ ఏడాదిలో అదనంగా 25 శాతంపైగా ప్రవేశాలు పెరిగాయని కన్వీనర్ వెల్లడించారు. అడ్మిషన్ల సంఖ్య ముగిసేవరకు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 50 వేలకు పైగా ప్రవేశాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు పా టించని ప్రైవేటు డిగ్రీ కాలేజీల వైపు విద్యార్థులు రావడం లేదని అధికారులు చెప్తున్నారు.

2133
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles