జోపో స్మార్ట్‌ఫోన్లపై 60 శాతం వరకు డిస్కౌంట్..!


Sat,August 12, 2017 07:46 PM

జోపో మొబైల్ రెండు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వినియోగదారులకు డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నది. పలు స్మార్ట్‌ఫోన్లపై 60 శాతం వరకు రాయితీని జోపో మొబైల్ అందజేస్తున్నది. జోపో కలర్ ఎఫ్5 స్మార్ట్‌ఫోన్ రూ.10,299 ధర ఉండగా అది రూ.4300 వరకు తగ్గింది. దీంతో ఈ ఫోన్‌ను ఇప్పుడు రూ.5,999కే యూజర్లు కొనుగోలు చేయవచ్చు. అలాగే జోపో కలర్ ఎస్5.5 రూ.4100 తగ్గి రూ.5499 ధరకు, స్పీడ్ 7ప్లస్, కలర్ ఎఫ్2 ఫోన్లు రూ.4వేలు తగ్గి రూ.8,999, రూ.6,499 ధరలకు లభిస్తున్నాయి. అదేవిధంగా స్పీడ్ 7 ఫోన్ ధర రూ.3వేలు తగ్గి రూ.7,999 ధరకు లభిస్తోంది. దీంతోపాటు కలర్ సి, కలర్ సి1, కలర్ ఇ, హీరో 1 ఫోన్లపై రూ.1000 నుంచి రూ.2990 వరకు తగ్గింపు ధర లభిస్తున్నది.

1410

More News

VIRAL NEWS