రూ.915కే జియోక్స్ ట్యూబ్‌లైట్ ఫీచర్‌ఫోన్..!


Tue,March 13, 2018 06:24 PM

జియోక్స్ మొబైల్స్ తన నూతన ఫీచర్‌ఫోన్ 'ట్యూబ్‌లైట్‌'ను ఇవాళ విడుదల చేసింది. సాధారణ ఫీచర్ ఫోన్లలో ఉండే సింగిల్ ఎల్‌ఈడీ టార్చిలైట్‌కు బదులుగా ఇందులో 8 ఎల్‌ఈడీ లైట్లు కలిగిన టార్చిలైట్‌ను ఏర్పాటు చేశారు. ఇదే ఇందులో ఉన్న ప్రత్యేకత. ఈ ఫీచర్ ఫోన్‌లో మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్, ప్రైవసీ లాక్, ఆటో కాల్ రికార్డింగ్, 2.4 ఇంచ్ డిస్‌ప్లే, ఇంటర్‌నెట్ కనెక్టివిటీ, మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్, వీజీఏ బ్యాక్ కెమెరా, 1800 ఎంఏహెచ్ బ్యాటరీ, ఎస్‌వోఎస్ ఫీచర్, వైర్‌లెస్ ఎఫ్‌ఎం, స్పీడ్ డయల్, బ్లూటూత్ వంటి సదుపాయాలు ఉన్నాయి. బ్లాక్, వైట్ రంగుల్లో ఈ ఫోన్ రూ.915కు వినియోగదారులకు లభిస్తున్నది.

7601

More News

VIRAL NEWS

Featured Articles