జియో ఫోన్‌కు యూట్యూబ్ కూడా వచ్చేసింది..!


Wed,September 19, 2018 05:52 PM

జియో ఫోన్ యూజర్లకు మరో శుభవార్త. కొన్ని రోజుల కిందటే జియో ఫోన్‌కు గాను వాట్సాప్‌ను విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఇప్పుడీ ఫోన్‌కు యూట్యూబ్ కూడా అందుబాటులోకి వచ్చింది. జియోఫోన్‌లో ఉన్న జియో స్టోర్‌లో యూట్యూబ్ యాప్‌ను యూజర్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని జియో వెల్లడించింది. జియో ఫోన్‌తోపాటు జియోఫోన్ 2 లోనూ ఈ యాప్ లభిస్తుంది. జియోలో ఉన్న కైఓఎస్‌ను ఆధారంగా చేసుకుని యూట్యూబ్ యాప్‌ను అందుకు అనుగుణంగా గూగుల్ డెవలప్ చేసింది. ఈ క్రమంలోనే జియో ఫోన్ హార్డ్‌వేర్‌కు అనుగుణంగా యూట్యూబ్ ఉత్తమమైన ప్రదర్శనను ఇస్తుందని జియో వెల్లడించింది. కాగా జియోఫోన్‌లో ఇప్పటికే ఫేస్‌బుక్ లభిస్తుండగా, ఆ యాప్‌కు మరిన్ని హంగులు చేర్చి త్వరలో నూతనంగా ఫేస్‌బుక్‌ను జియో ఫోన్ యూజర్లకు అందుబాటులోకి తేనున్నారు.

17926

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles