భార‌త్‌లో ప్రారంభ‌మైన యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం సేవ‌లు


Wed,March 13, 2019 11:40 AM

సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ త‌న యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం సేవ‌ల‌ను ఎట్ట‌కేల‌కు భార‌త్‌లో ఇవాళ ప్రారంభించింది. గ‌తేడాది మేలోనే ఈ సేవ‌లపై ప్ర‌క‌ట‌న చేశారు. కానీ ఇప్పుడు ఈ సేవ‌లు యూజ‌ర్ల‌కు అందుబాటులోకి వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే యూట్యూబ్ మ్యూజిక్ ద్వారా ఇప్పుడు భార‌త్‌లోని యూజ‌ర్లు త‌మ అభిరుచుల‌కు అనుగుణంగా అందులో ఉండే పాట‌ల‌ను విన‌వ‌చ్చు. అయితే యూట్యూబ్ మ్యూజిక్ ఫ్రీ, ప్రీమియం ఆప్ష‌న్ల‌లో వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది.

ఫ్రీ స‌ర్వీస్ అయితే యాప్‌లో యాడ్స్ వ‌స్తాయి. కానీ ప్రీమియం స‌ర్వీస్‌లో యాడ్స్ రావు. అయితే అందుకు గాను యూజ‌ర్లు కొంత రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలోనే లాంచింగ్ సంద‌ర్భంగా మొద‌టి 3 నెలల పాటు యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను ఉచితంగా అందిస్తున్నారు. ఆ త‌రువాత నెల‌కు రూ.99 చెల్లించాలి. లేదా రూ.149 చెల్లించి ఫ్యామిలీ ప్లాన్ తీసుకుంటే 5 మంది కుటుంబ స‌భ్యులు యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చు. ఇక ఈ యాప్ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ ప్లాట్‌ఫాంల‌పై యూజర్ల‌కు ల‌భిస్తున్న‌ది.

957

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles