మీకు ఎలాంటి దుస్తులు సూట్ అవుతాయో.. ఈ అద్దం చెప్పేస్తుంది..!


Thu,January 10, 2019 11:38 AM

బ‌ట్ట‌ల షాపుల‌కు వెళితే వాటిల్లో ఉండే దుస్తుల్లో వేటిని కొనుగోలు చేయాలో మ‌న‌కు అస్స‌లు అర్థం కాదు. అందుక‌నే నాలుగైదు షాపులు తిరిగి, ప‌ది, ఇర‌వై వెరైటీల‌ను ట్రై చేసి గానీ మ‌నం దుస్తుల‌ను కొనుగోలు చేయం. ఇదంతా శ్ర‌మతో కూడుకున్న వ్య‌వ‌హారం. అయితే ఇక‌పై ఇలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే.. ఎల్‌జీ కంపెనీ త‌యారు చేసిన స్మార్ట్ మిర్ర‌ర్‌తో మ‌న‌కు ఏ త‌ర‌హా దుస్తులు సూట్ అవుతాయో ఇట్టే తెలుసుకోవ‌చ్చు. అంతేకాదు, ఇంట్లో కూడా ఈ మిర్ర‌ర్‌ను పెట్టుకుంటే మ‌న వార్డ్ రోబ్ అంతా వెతికి అన్ని దుస్తుల‌ను ట్రై చేయాల్సిన అవ‌స‌రం లేకుండా, ఎంచ‌క్కా మిర్ర‌ర్ చెప్పిన దుస్తుల‌నే మ‌నం ధ‌రించ‌వ‌చ్చు.

ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు ఎల్‌జీ క‌న్‌జ్యూమ‌ర్ ఎల‌క్ట్రానిక్స్ షో (సీఈఎస్‌) 2019లో తాను నూత‌నంగా రూపొందిస్తున్న స్మార్ట్ మిర్ర‌ర్‌ను ప్ర‌ద‌ర్శించింది. ఈ మిర్ర‌ర్ ఎదురుగా నిల‌బ‌డితే చాలు, అందులో ఉండే ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ మ‌న శ‌రీరాన్ని స్కాన్ చేస్తుంది. మ‌న శ‌రీరం ఎత్తు, సైజ్, చ‌ర్మం క‌ల‌ర్ త‌దిత‌ర అనేక అంశాల‌ను బేరీజు వేసుకుని ఒక వ‌ర్చువ‌ల్ అవ‌తార్‌ను జ‌న‌రేట్ చేసి స్క్రీన్‌పై మ‌న‌కు చూపుతుంది. దీంతో ఆ అవతార్‌కు వివిధ ర‌కాల డ్రెస్సుల‌ను ధ‌రింప‌జేసి వాటిలో మ‌న‌కు ఏం న‌చ్చుతాయో ఇట్టే తెలుసుకోవ‌చ్చు. అయితే మిర్ర‌ర్‌లో ముందుగానే ఆయా ర‌కాల డ్రెస్సుల‌కు చెందిన న‌మూనాల‌ను స్టోర్ చేసి పెట్టాలి. దీంతో మ‌న బాడీ స్కాన్ అవ‌గానే జ‌న‌రేట్ అయిన అవ‌తార్ ఆ దుస్తుల‌ను ధ‌రించి మ‌న‌కు చూపుతుంది. వాటిల్లో మ‌న‌కు కావ‌ల్సిన దుస్తుల‌ను మ‌నం సుల‌భంగా ఎంపిక చేసుకోవ‌చ్చు. దీని వ‌ల్ల ప‌దే ప‌దే దుస్తుల‌ను ధ‌రించి స‌రిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాల్సిన ఇబ్బంది త‌ప్పుతుంది. ఇక ఇదే స్మార్ట్ మిర్ర‌ర్‌ను ఇంట్లో పెట్టుకుంటే మీ వార్డ్‌రోబ్‌లో ఉన్న దుస్తుల‌ను మీ అవ‌తార్‌కు ధ‌రింప‌జేసి చూపుతుంది. దీంతో వాటిల్లోనూ మీకు న‌చ్చిన దుస్తుల‌ను ఎంపిక చేసుకోవ‌చ్చు. అయితే ఈ స్మార్ట్ మిర్ర‌ర్ ప్ర‌స్తుతం ప్రోటో టైప్ ద‌శలోనే ఉన్న‌ది. వాణిజ్య ప‌రంగా ఈ మిర్ర‌ర్‌ను ఎప్పుడు అందుబాటులోకి తెచ్చేది ఎల్‌జీ చెప్ప‌లేదు.

2546
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles