షియోమీ ఐ ల‌వ్ ఎంఐ డేస్ సేల్.. త‌గ్గింపు ధ‌ర‌కు ఫోన్లు..


Mon,February 11, 2019 08:38 PM

మొబైల్స్ త‌యారీదారు షియోమీ నేటి నుంచి ఐ ల‌వ్ ఎంఐ డేస్ సేల్‌ను నిర్వ‌హిస్తున్న‌ది. ఈ సేల్ ఈ నెల 13వ తేదీన ముగియ‌నుండ‌గా ఇందులో ప‌లు ఎంఐ ఫోన్లు, టీవీల‌పై త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు. సేల్‌లో రెడ్‌మీ నోట్ 6 ప్రొకు చెందిన 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను రూ.12,999 ధ‌ర‌కు, 6జీబీ ర్యామ్ వేరియెంట్‌ను రూ.14,999 ధ‌ర‌కు, రెడ్‌మీ నోట్ 5 ప్రొ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్ వేరియెంట్‌ను రూ.12,999 ధ‌ర‌కు, రెడ్‌మీ 6 ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను రూ.8,499 ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. అలాగే ఎంఐ బ్యాండ్ హెచ్ఆర్ఎక్స్ ఎడిష‌న్‌ను రూ.1299కు, 43, 49 ఇంచుల ఎంఐ టీవీల‌ను రూ.22,999, రూ.30,999 ధ‌ర‌ల‌కు కొనుగోలు చేయ‌వచ్చు. ఈ సేల్ ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ల‌లోనూ కొన‌సాగుతున్న‌ది.

3891
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles