దీపావళి సేల్‌లో 8.5 మిలియన్ల డివైస్‌లను అమ్మిన షియోమీ


Mon,November 12, 2018 04:17 PM

దీవాలి ఎంఐ సేల్‌లో భాగంగా మొత్తం 8.5 మిలియన్ల డివైస్‌లను విక్రయించినట్లు షియోమీ ఇండియా వెల్లడించింది. ఈ మేరకు ఆ సంస్థ ఆన్‌లైన్ సేల్స్ హెడ్ రఘు రెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. అక్టోబర్ 9 నుంచి నవంబర్ 8వ తేదీ వరకు దీపావళి సేల్ పేరిట నిర్వహించిన సేల్‌లో భాగంగా అన్ని ప్లాట్‌ఫాంలలో కలిపి షియోమీకి చెందిన స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఇతర డివైస్‌లు మొత్తం 8.5 మిలియన్లు అమ్ముడుపోయాయన్నారు. వీటిల్లో స్మార్ట్‌ఫోన్ల సంఖ్యే 6 మిలియన్ల వరకు ఉంటుందని అన్నారు. అలాగే 4 లక్షల ఎంఐ టీవీలు, 2.1 మిలియన్ల ఎకో సిస్టమ్ పరికరాలను విక్రయించామన్నారు.

దీపావళి సేల్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో షియోమీ బెస్ట్ సెల్లర్‌గా నిలిచిందని రఘు రెడ్డి తెలిపారు. ఈ సేల్ పీరియడ్‌లో ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్కువ మంది కొనుగోలు చేసిన ఫోన్‌గా రెడ్‌మీ నోట్ 5 ప్రొ నిలవగా, అమెజాన్‌లో రెడ్‌మీ 6ఎ ఫోన్‌ను ఎక్కువగా కొనుగోలు చేశారన్నారు. స్మార్ట్‌ఫోన్ సేల్స్‌లో షియోమీ దీపావళి పీరియడ్‌లో నంబర్ వన్ సెల్లర్‌గా నిలవగా, టీవీలు, ఎంఐ బ్యాండ్ 3, ఎంఐ పవర్ బ్యాంక్ తదితర డివైస్‌ల అమ్మకాల్లోనూ షియోమీ ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఈ క్రమంలో మొత్తం అమ్ముడైన డివైస్‌ల విలువ 1 బిలియన్ యూఎస్ డాలర్లకు చేరుకుందని అన్నారు.

1633

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles