ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ లభిస్తున్న షియోమీ ఎంఐ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీలు


Mon,September 24, 2018 04:58 PM

షియోమీకి చెందిన ఎంఐ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీలు ప్రస్తుతం ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ వినియోగదారులకు లభిస్తున్నాయి. ఈ మేరకు షియోమీ ఇండియా తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ఇంతకు ముందు వరకు షియోమీ స్మార్ట్‌టీవీలు కేవలం ఎంఐ ఆన్‌లైన్ స్టోర్స్, ఎంఐ హోమ్ స్టోర్స్‌లో మాత్రమే లభించేవి. కానీ ఇకపై దేశ వ్యాప్తంగా ఉన్న 9 సిటీల్లోని ఎంఐ పార్ట్‌నర్ స్టోర్స్‌లోనూ షియోమీ టీవీలు లభిస్తాయని ఆ సంస్థ వెల్లడించింది. ఇప్పటికే గడిచిన 6 నెలల్లో 5 లక్షలకు పైగా ఎంఐ ఎల్‌ఈడీ స్మార్ట్‌టీవీలను విక్రయించామని, ఈ క్రమంలో వినియోగదారుల నుంచి షియోమీ టీవీలకు వస్తున్న ఆదరణను చూసి మరింత విస్తృతంగా టీవీలను అందజేయాలని భావించామని, అందుకనే ఇతర ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ తమ టీవీలను విక్రయిస్తున్నామని షియోమీ వెల్లడించింది. కాగా దేశవ్యాప్తంగా ఉన్న 9 నగరాలైన న్యూఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్, కోల్‌కతా, ఇండోర్, పాట్నా, పూణె, ముంబై, మద్దూర్‌లలోని ఎంఐ పార్ట్‌నర్ స్టోర్స్‌లోనూ ఇకపై షియోమీ ఎంఐ టీవీలు లభిస్తాయి. త్వరలో మరిన్ని నగరాల్లో షియోమీ తన టీవీలను ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో విక్రయించనుంది.

2795

More News

VIRAL NEWS