షియోమీ నుంచి 43 ఇంచెస్ టీవీ - ధర రూ.18,500


Wed,March 23, 2016 05:57 PM

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు షియోమీ 'ఎంఐ టీవీ 3ఎస్' పేరిట రెండు నూతన టీవీ మోడల్స్‌ను తాజాగా చైనా మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఒక మోడల్ 65 ఇంచుల కర్వ్‌డ్ డిస్‌ప్లేతో 4కె అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. కాగా మరొక మోడల్ 43 ఇంచుల డిస్‌ప్లేతో ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఈ రెండు మోడల్స్ త్వరలోనే భారత్‌లోని వినియోగదారులకు కూడా లభ్యం కానున్నాయి. 65 ఇంచుల మోడల్ ధర రూ.82,500 ఉండగా, 43 ఇంచుల మోడల్‌ను రూ.18,500 ధరకు విక్రయించనున్నారు.

కాగా ఎంఐటీవీ 3ఎస్ 65 ఇంచ్ మోడల్ ఎంస్టార్ 6ఎ928 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, డాల్బీ డీటీఎస్ ఆడియో వంటి ఫీచర్లను కలిగి ఉంది. 43 ఇంచుల మోడల్ టీవీ ఎంస్టార్ 6ఎ908 ప్రాసెసర్‌ను, డాల్బీ డీటీఎస్ ఆడియోను కలిగి ఉంది. ఈ రెండు టీవీలు ఆండ్రాయిడ్ ఆధారిత ఎంఐయుఐ ఆపరేటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉన్నాయి.

9219

More News

VIRAL NEWS