షియోమీ నుంచి '4కె అల్ట్రా హెచ్‌డీ' టీవీ...


Thu,December 31, 2015 02:20 PM

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీదారు షియోమీ 'ఎంఐ టీవీ 3' పేరిట ఓ నూతన '4కె అల్ట్రా హెచ్‌డీ టీవీ'నీ తాజాగా చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.1.02 లక్షల ధర ఉన్న ఈ టీవీ త్వరలోనే భారత మార్కెట్‌లోనూ లభ్యం కానుంది.

ఎంఐ టీవీ 70 ఇంచుల తెరను కలిగి ఉంది. 3840 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌ను ఇందులో అందిస్తున్నారు. 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్, 4కె అల్ట్రా హెచ్‌డీ డిస్‌ప్లే, 1.4 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, మాలి 760 ఎంపీ4 జీపీయూ, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, మెటలిక్ బాడీ ఫినిషింగ్, వైఫై, బ్లూటూత్ 4.1 ఎల్‌ఈ, హెచ్‌డీఎంఐ, మైక్రో యూఎస్‌బీ, యూఎస్‌బీ, ఈథర్‌నెట్ పోర్ట్ కనెక్టివిటీ, 2.5 ఇంచ్ ఫుల్ రేంజ్ స్టీరియో స్పీకర్స్, డాల్బీ డీటీఎస్ వర్చువల్ సరౌండ్ సౌండ్ అండ్ బేస్ బూస్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

11409

More News

VIRAL NEWS