షియోమీ రెడ్‌మీ వై2 బ్లూ, బ్లాక్ కలర్ వేరియెంట్ల విడుదల


Sun,September 23, 2018 12:53 PM

మొబైల్స్ తయారీదారు షియోమీ తన రెడ్‌మీ వై2 స్మార్ట్‌ఫోన్‌ను ఈ ఏడాది జూన్‌లో విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్‌కు గాను తాజాగా బ్లాక్, బ్లూ కలర్ వేరియెంట్లను షియోమీ విడుదల చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న గోల్డ్, రోజ్ గోల్డ్, డార్క్ గ్రే కలర్ వేరియెంట్ల సరసన ఈ కొత్త వేరియెంట్లు చేరాయి. కాగా రెడ్‌మీ వై2 బ్లాక్, బ్లూ కలర్ వేరియెంట్లు అమెజాన్, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లలో రూ.9,999 ప్రారంభ ధరకు లభిస్తున్నాయి.

షియోమీ రెడ్‌మీ వై2 ఫీచర్లు...


5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ.

4193
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles