అదిరిపోయే ఫీచర్లతో రెడ్‌మీ నోట్ 8 ప్రొ స్మార్ట్‌ఫోన్


Sat,October 19, 2019 05:23 PM

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 8 ప్రొను తాజాగా భారత్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.14,999 ఉండగా, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.15,999, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.17,999గా ఉంది. అమెజాన్, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లలో ఈ ఫోన్‌ను ఈ నెల 21వ తేదీ నుంచి విక్రయించనున్నారు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.

రెడ్‌మీ నోట్ 8 ప్రొ స్మార్ట్‌ఫోన్‌లో.. 6.53 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి90టి ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 64, 8, 2, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

4931
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles