ఈ నెల 20న విడుద‌ల కానున్న షియోమీ రెడ్‌మీ నోట్ 7ఎస్


Thu,May 16, 2019 01:02 PM

మొబైల్స్ త‌యారీదారు షియోమీ త‌న నూత‌న స్మార్ట్‌పోన్ రెడ్‌మీ నోట్ 7ఎస్‌ను ఈ నెల 20వ తేదీన విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపింది. ఇటీవ‌లే విడుద‌లైన రెడ్‌మీ నోట్ 7, నోట్ 7 ప్రొ ఫోన్లు భార‌త్‌లో 20 ల‌క్ష‌ల‌కు పైగా యూనిట్లు అమ్ముడైన నేప‌థ్యంలో వాటికి కొన‌సాగింపుగా రెడ్‌మీ నోట్ 7ఎస్ ఫోన్‌ను లాంచ్ చేయ‌నున్న‌ట్లు షియోమీ తెలిపింది. ఇక ఈ ఫోన్‌లో 48 మెగాపిక్స‌ల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను ఏర్పాటు చేశారు. దీంతోపాటు స్నాప్‌డ్రాగ‌న్ 730 ప్రాసెస‌ర్‌ను కూడా ఈఫోన్ లో అమ‌ర్చారు. అయితే ఈ ఫోన్‌లో అందివ్వ‌నున్న ఇత‌ర ఫీచ‌ర్ల వివ‌రాల‌ను షియోమీ ఇంకా వెల్ల‌డించ‌లేదు. త్వ‌ర‌లో ఆ వివ‌రాలు తెలుస్తాయి.

2457
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles