ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన షియోమీ రెడ్‌మీ నోట్ 7ఎస్ స్మార్ట్‌ఫోన్


Mon,May 20, 2019 02:40 PM

మొబైల్స్ త‌యారీదారు షియోమీ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 7ఎస్‌ను భార‌త మార్కెట్‌లో ఇవాళ విడుద‌ల చేసింది. ఇందులో వెనుక భాగంలో 48 మెగాపిక్స‌ల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను ఏర్పాటు చేశారు. అలాగే ముందు భాగంలో ఉన్న 13 మెగాపిక్స‌ల్ కెమెరాకు ఫేస్ అన్‌లాక్ స‌దుపాయాన్ని అందిస్తున్నారు. ఈ ఫోన్ వెనుక భాగానికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌ను క‌ల్పించారు. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ వెనుక భాగంలో ఉంది. ఈ ఫోన్‌లో 4000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని ఏర్పాటు చేయ‌గా, దీనికి ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు.

రెడ్‌మీ నోట్ 7ఎస్ స్మార్ట్‌ఫోన్ ఆనిక్స్ బ్లాక్‌, స‌ఫైర్ బ్లూ, రూబీ రెడ్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌ల కాగా ఈ ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.10,999 ధ‌ర‌కు, 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.12,999 ధ‌ర‌కు ఈ నెల 23వ తేదీ నుంచి ల‌భ్యం కానున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్, ఎంఐ హోం స్టోర్‌ల‌లో ఈ ఫోన్‌ను విక్ర‌యించ‌నున్నారు.

రెడ్‌మీ నోట్ 7ఎస్ ఫీచ‌ర్లు...


6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 ×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లాగ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 48, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్‌, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఐఆర్ సెన్సార్‌, స్ల్పాష్ ప్రూఫ్ కోటింగ్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 4.0.

3208
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles