ఆక‌ట్టుకునే ఫీచర్ల‌తో విడుద‌లైన షియోమీ రెడ్‌మీ నోట్ 7 ప్రొ స్మార్ట్‌ఫోన్


Mon,March 18, 2019 12:31 PM

మొబైల్స్ త‌యారీదారు షియోమీ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్‌7 ప్రొ ను చైనా మార్కెట్‌లో ఇవాళ విడుద‌ల చేసింది. రూ.16,999 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ఈ నెల 22వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

రెడ్‌మీ నోట్ 7 ప్రొ ఫీచ‌ర్లు...
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 ×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 675 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్, 48, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఐఆర్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 4.0.

2533

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles