ఈ నెల 28న భార‌త్‌లో విడుద‌ల కానున్న షియోమీ రెడ్‌మీ నోట్ 7


Thu,February 14, 2019 12:30 PM

మొబైల్స్ త‌యారీదారు షియోమీ త‌న రెడ్‌మీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెల 28వ తేదీన భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేయ‌నుంది. ఇందులో వెనుక భాగంలో 48 మెగాపిక్స‌ల్ కెపాసిటీ ఉన్న భారీ కెమెరాను ఏర్పాటు చేశారు. 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. ఇక ఈ ఫోన్ ధ‌ర రూ.10,390గా ఉండే అవ‌కాశం ఉంది.

షియోమీ రెడ్‌మీ నోట్‌7 ఫీచ‌ర్లు...

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 ×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 660 ప్రాసెస‌ర్‌, 3/4/6 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 48, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఐఆర్ సెన్సార్, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 4.0.

2647

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles