48 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాతో రెడ్‌మీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్‌


Thu,January 10, 2019 03:27 PM

మొబైల్స్ త‌యారీదారు షియోమీ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 7 ను ఇవాళ చైనా మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 6.3 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 48, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ కెమెరాల‌ను అందిస్తున్నారు. ముందు భాగంలో 13 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో వెనుక భాగంలో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. 4000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న భారీ బ్యాటరీని ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. దీనికి క్విక్ చార్జ్ 4.0 స‌పోర్ట్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.10,390 ఉండ‌గా, 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.12,460 ఉంది. అలాగే 6జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌రను రూ.14,540 గా నిర్ణ‌యించారు. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను విక్ర‌యించ‌నున్నారు.

రెడ్‌మీ నోట్ 7 ఫీచ‌ర్లు...
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 ×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 660 ప్రాసెస‌ర్‌, 3/4/6 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 48, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఐఆర్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 4.0.

2663

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles