రెడ్‌మీ నోట్ 5 సర్‌ప్రైజ్ ఫ్లాష్ సేల్


Fri,March 16, 2018 03:39 PM

న్యూఢిల్లీ: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ మేకర్ షియోమీ తన కొత్త మోడల్ రెడ్‌మీ నోట్ 5 కోసం ఫ్లాష్‌సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్ ఎంఐ.కామ్, ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో మార్చి 16 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభించింది. వినియోగదారుల కోసం సర్‌ప్రైజ్ ఫ్లాష్ సేల్ నిర్వహిస్తున్న కంపెనీ ట్విటర్‌లో వెల్లడించింది. కేవలం ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యం ఉందని షరతులు విధించింది. వినియోగదారుల నుంచి డిమాండ్ ఏర్పడటంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. కొనుగోలుదారుల కోసం స్మార్ట్‌ఫోన్లను విక్రయించడం ఈ వారంలో ఇది రెండోసారి. సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం కేవలం రెడ్‌మీ నోట్ 5 మాత్రమే విక్రయిస్తున్నట్లు ట్విటర్‌లో పేర్కొనగా.. ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రం రెడ్‌మీ నోట్ 5ప్రొ కూడా కొనుగోలు చేయొచ్చని వెబ్‌సైట్‌లో చూపిస్తుంది. షియోమీ వెబ్‌సైట్ ఆధారంగా రెడ్‌మీ నోట్ 5ప్రొ తరువాతి సేల్‌ను వచ్చే బుధవారం నిర్వహిస్తామని తెలియజేస్తుంది.

9790

More News

VIRAL NEWS