రేపు విడుదల కానున్న రెడ్‌మీ నోట్ 5.. అందులో ఉన్న అదిరిపోయే ఫీచర్లివే..?


Tue,February 13, 2018 03:52 PM

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 5ను రేపు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 14న మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలో జరగనున్న ఓ ఈవెంట్‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు షియోమీ ఇటీవలే అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలో విడుదలకు ఒక రోజు ముందు రెడ్‌మీ నోట్ 5 ఫోన్‌కు చెందిన ఫీచర్లు నెట్‌లో లీకయ్యాయి. దాని ప్రకారం ఈ ఫోన్‌లో ఉన్న ఫీచర్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

లీకైన వివరాల ప్రకారం రెడ్‌మీ నోట్ 5లో 5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ భారీ డిస్‌ప్లే, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఇక రెడ్‌మీ నోట్ 5 మాత్రమే కాకుండా దీనికి మరిన్ని ఫీచర్లు జతచేయబడిన రెడ్‌మీ నోట్ 5 ప్రొను కూడా షియోమీ విడుదల చేయనున్నట్లు తెలిసింది. అందులో 5.99 ఇంచ్ భారీ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇక ఈ రెండు ఫోన్ల ధరల వివరాలను మాత్రం షియోమీ ఇంకా వెల్లడించలేదు.

4238

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles