ఈ నెల 22 నుంచి రెడ్‌మీ నోట్ 5, నోట్ 5 ప్రొ అమ్మకాలు


Thu,February 15, 2018 08:36 AM

షియోమీ సంస్థ తన నూతన స్మార్ట్‌ఫోన్లు రెడ్‌మీ నోట్ 5, నోట్ 5 ప్రొలను నిన్న విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్లు లభ్యమయ్యే తేదీలను షియోమీ తాజాగా ప్రకటించింది. ఈ రెండు ఫోన్లు ఫిబ్రవరి 22వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ప్రత్యేకంగా లభ్యం కానున్నాయి. 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో రెడ్‌మీ నోట్ 5 స్మార్ట్‌ఫోన్ రూ.9,999, రూ.11,999 ధరలకు వినియోగదారులకు లభ్యం కానుండగా, 4/6 జీబీ ర్యామ్ వేరియెంట్లలో రెడ్‌మీ నోట్ 5 ప్రొ రూ.13,999, రూ.16,999 ధరలకు లభ్యం కానుంది. ఇక వీటిల్లో ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి.

షియోమీ రెడ్‌మీ నోట్ 5 ఫీచర్లు...


5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.
Xiaomi-Redmi-Note-5-Pro

షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొ ఫీచర్లు...


5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

2770

More News

VIRAL NEWS