4 నెలల్లో ఆ రెండు ఫోన్లు 50 లక్షలు అమ్ముడయ్యాయ్..!


Sat,June 30, 2018 05:42 PM

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు షియోమీ గత ఫిబ్రవరి నెలలో రెడ్‌మీ నోట్ 5 ఫోన్లను విడుదల చేసిన విషయం విదితమే. రెడ్‌మీ నోట్ 5, నోట్ 5 ప్రొ పేరిట రెండు మోడల్స్‌ను షియోమీ విడుదల చేసింది. అయితే ఇప్పటి వరకు.. అంటే.. ఆ ఫోన్లను విడుదల చేసి ఇప్పటికి 4 నెలలు కాగా.. ఈ సమయంలో ఆ రెండు ఫోన్లు కలిపి మొత్తం 50 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయని షియోమీ ఇండియా తన ట్విట్టర్ అకౌంట్‌లో వెల్లడించింది.

గతేడాది షియోమీ రెడ్‌మీ నోట్ 4 విడుదల కాగా ఆ ఫోన్ అమ్మకాలు 6 నెలల్లో 50 లక్షలు అయ్యాయి. కానీ రెడ్‌మీ నోట్ 5, నోట్ ప్రొ ఫోన్లు మాత్రం ఆ సంఖ్యను చేరుకునేందుకు కేవలం 4 నెలలు మాత్రమే పట్టడం విశేషం. అయినప్పటికీ షియోమీ ఇంకా రెడ్‌మీ నోట్ 5 ప్రొకు చెందిన 6జీబీ ర్యామ్ మోడల్‌ను ప్రతి వారం ఫ్లాష్ సేల్‌లోనే విక్రయిస్తున్నది. సేల్ ఆరంభమైన కొంత సేపటికే ఫోన్లు వేగంగా అమ్ముడవుతున్నాయని షియోమీ వెల్లడించింది.

5473

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles