కేవ‌లం రూ.4499 కే షియోమీ రెడ్‌మీ గో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్


Tue,March 19, 2019 02:10 PM

మొబైల్స్ త‌యారీదారు షియోమీ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ గో ను ఇవాళ భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఇందులో ఆండ్రాయిడ్ గో ఎడిష‌న్ ఓఎస్‌ను అందిస్తున్నారు. కాగా ఈ ఓఎస్ క‌లిగిన మొద‌టి షియోమీ ఫోన్ ఇదే కావ‌డం విశేషం. ఇక ఈ ఫోన్ రూ.4499 ధ‌ర‌కే వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది. ఈ నెల 22వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌, ఎంఐ హోమ్ స్టోర్స్‌లో ఈ ఫోన్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా విక్ర‌యంచ‌నున్నారు. ఇక ఈ ఫోన్‌ను కొన్న జియో కస్ట‌మ‌ర్ల‌కు రూ.2200 క్యాష్‌బ్యాక్‌ను అందివ్వ‌నున్నారు.

షియోమీ రెడ్‌మీ గో ఫీచ‌ర్లు...

5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగ‌న్ 425 ప్రాసెస‌ర్‌, 1 జీబీ ర్యామ్‌, 8 జీబీ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిష‌న్‌, డ్యుయ‌ల్ సిమ్, 8 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

4628

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles