రెడ్‌మీ 7 స్మార్ట్‌ఫోన్‌ను విడుద‌ల చేసిన షియోమీ


Mon,March 18, 2019 01:12 PM

మొబైల్స్ త‌యారీదారు షియోమీ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 7 ను ఇవాళ చైనా మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఈ ఫోన్ రూ.8,170 ప్రారంభ ధ‌ర‌కు వినియోగ‌దారుల‌కు ఈ నెల 26వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచర్ల‌ను అందిస్తున్నారు.

షియోమీ రెడ్‌మీ 7 ఫీచ‌ర్లు...


6.26 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1520 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 632 ప్రాసెస‌ర్‌, 2/3/4 జీబీ ర్యామ్‌, 16/32/64 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 12, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

3770

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles