రెడ్‌మీ 6 స్మార్ట్‌ఫోన్ ధ‌రను తగ్గించిన షియోమీ


Sun,January 13, 2019 09:36 AM

మొబైల్స్ త‌యారీదారు షియోమీ త‌న రెడ్‌మీ 6 స్మార్ట్‌ఫోన్ ధ‌ర‌ను త‌గ్గించింది. ఈ ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌వేరియెంట్ ధ‌ర‌ను రూ.500 త‌గ్గించ‌డంతో ఇప్పుడీ ఫోన్‌ను రూ.7,999 ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. అలాగే ఇదే ఫోన్‌కు చెందిన 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర‌ను కూడా రూ.500 త‌గ్గించారు. దీంతో ఈ ఫోన్‌ను రూ.8,999 ధ‌ర‌కు వినియోగ‌దారులు కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్లు, ఆఫ్‌లైన్ స్టోర్స్‌ల‌లో ఈ ఫోన్ ఇప్పుడు త‌గ్గింపు ధ‌ర‌కు ల‌భిస్తున్న‌ది. ఇక ఫీచ‌ర్ల విష‌యానికి వ‌స్తే రెడ్‌మీ 6 ఫోన్‌లో 5.45 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెస‌ర్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్‌, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ సిమ్‌, డెడికేటెడ్ మైక్రోఎస్‌డీ కార్డ్ స్లాట్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ త‌దిత‌ర ఫీచ‌ర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.

5257

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles