షియోమీ రెడ్‌మీ 6 స్మార్ట్‌ఫోన్ విడుదల


Thu,September 6, 2018 12:57 PM

షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 6 ను తాజాగా విడుదల చేసింది. 32/64 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో ఈ ఫోన్ రూ.7,999, రూ.9,499 ధరలకు వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ఈ నెల 10వ తేదీ నుంచి లభ్యం కానుంది. హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డులతో ఈ ఫోన్‌ను కొన్నవారికి రూ.500 వరకు రాయితీని ఇవ్వనున్నారు. ఇక ఈ ఫోన్‌లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.

రెడ్‌మీ 6 స్మార్ట్‌ఫోన్‌లో ముందు భాగంలో ఉన్న 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాకు ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని కల్పించారు. వెనుక భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ ఫోన్‌లో మెమొరీ కార్డు కోసం డెడికేటెడ్ స్లాట్‌ను అమర్చారు. ఈ ఫోన్‌లో డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ ఫీచర్ ఉంది. దీని వల్ల ఒకేసారి రెండు సిమ్ కార్డులలో 4జీ వీవోఎల్‌టీఈ సదుపాయం పొందవచ్చు. సిమ్‌లను స్వాప్ చేయాల్సిన పని ఉండదు.

షియోమీ రెడ్‌మీ 6 ఫీచర్లు...


5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

1968

More News

VIRAL NEWS