రేపు విడుద‌ల కానున్న షియోమీ రెడ్‌మీ 6 సిరీస్ ఫోన్లు..!


Tue,September 4, 2018 05:21 PM

చైనాకు చెందిన మొబైల్స్ త‌యారీదారు షియోమీ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ల‌ను రేపు విడుద‌ల చేయ‌నుంది. రెడ్‌మీ 6 సిరీస్‌లో ఈ ఫోన్లు విడుద‌ల కానున్నాయి. ఈ ఫోన్ల‌ను అమెజాన్‌ల ప్ర‌త్యేకంగా విక్ర‌యించ‌నున్నారు. షియోమీ రెడ్ మీ 6, రెడ్‌మీ 6ఎ, రెడ్‌మీ 6ప్రొ పేరిట ఈ ఫోన్లు విడుద‌ల కానున్నాయి. రెడ్‌మీ 6 ప్రొ ఫోన్‌ను మాత్రం ఫ్లిప్‌కార్ట్‌లో ప్ర‌త్యేకంగా విక్ర‌యించ‌నున్న‌ట్లు స‌మాచారం.

ఈ ఫోన్ల‌లో డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ ఫీచ‌ర్‌ను ప్ర‌ధానంగా అందించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిసింది. ఈ ఫీచ‌ర్ ఉంటే రెండు సిమ్ కార్డుల‌లో ఏక కాలంలో 4జీ వీవోఎల్‌టీఈ సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. సిమ్ ను 4జీ వీవోఎల్‌టీఈ కోసం స్వాప్ చేయాల్సిన ప‌నిలేదు. ఇక ఈ ఫోన్ల‌లో ఎప్ప‌టిలా కాక ఈ సారి భిన్నంగా మీడియా టెక్ ప్రాసెస‌ర్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు స‌మాచారం. కాగా ఈ ఫోన్ల ధ‌ర వివ‌రాలు కూడా రేపు లాంచింగ్ సంద‌ర్భంగా తెలుస్తాయి.

4390

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles