ఓపెన్ సేల్‌లో లభిస్తున్న షియోమీ రెడ్‌మీ 6, రెడ్‌మీ 6ఎ ఫోన్లు


Thu,November 8, 2018 11:11 AM

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు షియోమీ తన రెడ్‌మీ 6, రెడ్‌మీ 6ఎ ఫోన్లను సెప్టెంబర్ నెలలో భారత మార్కెట్‌లో విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్లను ఇప్పటి వరకు కేవలం ఫ్లాష్ సేల్‌లో మాత్రమే విక్రయించారు. అయితే ఇప్పుడీ ఫోన్లు ఓపెన్ సేల్‌లో లభిస్తున్నాయి. రెడ్‌మీ 6ఎకు చెందిన 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.6,999 ఉండగా, 16జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.5,999 గా ఉంది. ఈ ఫోన్ ఈ నెల 14వ తేదీ నుంచి ఓపెన్ సేల్‌లో అమెజాన్ సైట్‌లో లభ్యం కానుంది.

రెడ్‌మీ 6కు చెందిన 3జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెట్ రూ.9,499 ధరకు, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.7,999 ధరకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో రేపటి నుంచి ఓపెన్ సేల్‌లో లభ్యం కానున్నాయి. అలాగే ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లోనూ ఈ ఫోన్లను ఓపెన్ సేల్‌లో విక్రయించనున్నారు.

2083

More News

VIRAL NEWS