ఈ నెల 5న విడుదల కానున్న షియోమీ రెడ్‌మీ 6 సిరీస్ ఫోన్లు..!


Sun,September 2, 2018 05:08 PM

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు షియోమీ తన రెడ్‌మీ సిరీస్‌లో నూతన స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది. రెడ్‌మీ 6, 6ఎ, 6 ప్రొ పేరిట ఈ ఫోన్లు విడుదల కానున్నాయి. ఈ నెల 5వ తేదీన భారత్‌లో ఈ ఫోన్లను విడుదల చేయనున్నారు.

షియోమీ రెడ్‌మీ 6ఎ ఫీచర్లు...


5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

షియోమీ రెడ్‌మీ 6 ఫీచర్లు...


5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

షియోమీ రెడ్‌మీ 6 ప్రొ ఫీచర్లు...


5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ స్నాప్‌డ్రాగన్ 625 ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

6830

More News

VIRAL NEWS

Featured Articles