ఈ నెల 22న షియోమీ కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ విడుదల


Tue,August 14, 2018 12:32 PM

మొబైల్స్ తయారీదారు షియోమీ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ పోకో ఎఫ్1ను ఈ నెల 22వ తేదీన విడుదల చేయనుంది. పోకో సబ్‌బ్రాండ్ కింద ఈ ఫోన్‌ను షియోమీ భారత్‌లో విడుదల చేస్తుంది. ఇప్పటికే ఈ ఫోన్ లాంచింగ్‌పై మీడియాకు షియోమీ ఆహ్వానాలను పంపింది. వాటిల్లో మాస్టర్ ఆఫ్ స్పీడ్ అనే ట్యాగ్‌లైన్ ఉండడం విశేషం. అంటే.. ఈ ఫోన్ గతంలో వచ్చిన ఫోన్ల కన్నా అత్యుత్తమమైన ప్రదర్శనను ఇస్తుందని తెలుస్తోంది.

పోకో ఎఫ్1 స్మార్ట్‌ఫోన్‌లో 5.99 ఇంచుల భారీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, ఐఆర్ ఫేస్ అన్‌లాక్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందివ్వనుంది.

షియోమీ పోకో ఎఫ్1 ఫీచర్లు...
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, ఫాస్ట్ చార్జింగ్.

2551

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles