వామ్మో.. షియోమీ ఫోన్ల‌తో డేంజ‌రే..!


Sat,February 9, 2019 06:08 PM

స్మార్ట్‌ఫోన్ల నుంచి రేడియేష‌న్ వ‌స్తుంద‌నే విష‌యం అందరికీ తెలిసిందే క‌దా. అయితే ప్ర‌స్తుతం మ‌న‌కు మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ర‌క ర‌కాల స్మార్ట్‌ఫోన్లు భిన్నమైన రేడియేష‌న్‌ను వెలువ‌రిస్తుంటాయి. ఈ క్ర‌మంలోనే అస‌లు అన్ని ఫోన్లలోనూ ఎక్కువ రేడియేష‌న్ వెలువ‌రిస్తున్న ఫోన్ల వివ‌రాల‌ను ఓ సంస్థ తాజాగా వెల్ల‌డించింది. వాటిల్లో షియోమీ ఎంఐ ఎ1 నంబ‌ర్ వ‌న్ స్థానంలో నిల‌వ‌డం విశేషం.

అవును, మీరు విన్నది నిజ‌మే. ప్ర‌స్తుతం మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కంపెనీల‌కు చెందిన స్మార్ట్‌ఫోన్ల‌లో షియోమీకి చెందిన ఎంఐ ఎ1 ఫోన్‌లోనే రేడియేష‌న్ ఎక్కువ వెలువడుతుంద‌ట‌. ఈ విష‌యాన్ని జ‌ర్మ‌న్ ఫెడ‌ర‌ల్ ఆఫీస్ ఫ‌ర్ రేడియేష‌న్ ప్రొటెక్ష‌న్ అనే సంస్థ తాజాగా చేప‌ట్టిన త‌న అధ్య‌య‌నంలో వెల్ల‌డించింది. కాగా అధిక రేడియేష‌న్ వెలువ‌రిస్తున్న ఫోన్ల‌లో చైనాకు చెందిన షియోమీ, వ‌న్‌ప్ల‌స్ ఫోన్లు అగ్ర స్థానంలో ఉన్నాయ‌ని కూడా ఆ అధ్య‌య‌నంలో తెలిసింది. ఇక శాంసంగ్‌కు చెందిన ఫోన్ల‌లో చాలా త‌క్కువ స్థాయి రేడియేష‌న్ ఉంటుంద‌ని కూడా అధ్య‌య‌నంలో వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

షియోమీకి చెందిన ఎంఐ ఏ1 ఫోన్ ద్వారా అత్యధిక స్థాయిలో 1.74 వాట్స్ ప‌ర్ కిలోగ్రామ్ రేడియేష‌న్ వెలువ‌డుతున్న‌ద‌ట‌. అలాగే వ‌న్‌ప్ల‌స్ 5టి ఫోన్ ద్వారా 1.68 వాట్స్ ప‌ర్ కిలోగ్రామ్ రేడియేష‌న్ వెలువ‌డుతుంద‌ట‌. ఈ క్ర‌మంలో అధిక రేడియేష‌న్‌ను వెలువ‌రిస్తున్న ఫోన్ల‌లో ఈ ఫోన్ రెండో స్థానంలో నిలిచింది. ఇక షియోమీకి చెందిన ఎంఐ మ్యాక్స్ 3 ఫోన్‌లో 1.58 వాట్స్ ప‌ర్ కిలోగ్రామ్ రేడియేష‌న్ వెలువ‌డుతుంద‌గా, అత్య‌ధికంగా రేడియేషన్‌ను వెలువ‌రిస్తున్న తొలి 16 ఫోన్లలో 8 షియోమీ, వ‌న్‌ప్ల‌స్ బ్రాండ్‌ల‌కు చెందిన‌వే కావ‌డం గ‌మ‌నార్హం. ఇక యాపిల్‌కు చెందిన ఐఫోన్ 7, 8 లు కూడా ఈ జాబితాలో ఉండ‌గా, ఐఫోన్ 7 రేడియేష‌న్ స్థాయి 1.38 వాట్స్ ప‌ర్ కిలోగ్రామ్‌గా ఉంది. కాగా శాంసంగ్‌కు చెందిన గెలాక్సీ నోట్ 8 రేడియేష‌న్ 0.17 వాట్స్ ప‌ర్ కిలోగ్రామ్ మాత్ర‌మే ఉండ‌డం విశేషం. అలాగే గెలాక్సీ ఎ8, ఎస్‌8 ప్ల‌స్‌, ఎస్‌7 ఎడ్జ్‌, ఎస్‌9 ప్ల‌స్‌, ఎస్‌8 ఫోన్ల రేడియ‌ష‌న్ స్థాయి కూడా 1 వాట్ ప‌ర్ కిలోగ్రామ్ లోపే ఉంద‌ని అధ్య‌య‌నంలో తేలింది.

9769
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles