షియోమీ బంపర్ ఆఫర్.. స్మార్ట్ టీవీ కొంటే 3 నెలల పాటు ఇంటర్నెట్ ఫ్రీ...!


Wed,June 13, 2018 05:44 PM

మొబైల్స్ తయారీదారు షియోమీ వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. షియోమీకి చెందిన ఏదైనా ఎంఐ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీని కొంటే 3 నెలల పాటు యాక్ట్ ఫైబర్‌నెట్‌కు చెందిన ఇంటర్నెట్‌ను ఉచితంగా అందిస్తున్నది. అందుకు గాను వినియోగదారులు తాము టీవీ కొన్న తరువాత తమ వివరాలతోపాటు బిల్లును స్కాన్ చేసి actwithmi@incredible.actcorp.in అనే మెయిల్‌కు పంపాలి. అనంతరం యాక్ట్ ప్రతినిధులు ఆ బిల్లును వెరిఫై చేసుకుని 2 రోజుల్లో ఆఫర్ వివరాలు తెలియజేస్తారు. అప్పుడు వినియోగదారులు తమ వివరాలను తెలిపితే తాము ఉన్న చిరునామాకు యాక్ట్ ఫైబర్‌నెట్ కనెక్షన్‌ను ఇస్తారు.

అలా కనెక్షన్ ఇచ్చాక మొదటి నెల ఇంటర్నెట్‌ను ఉచితంగా అందిస్తారు. తరువాత వినియోగదారులు 6 నెలల ప్లాన్‌ను ఎంచుకోవాలి. అందులో కేవలం 4 నెలలకు పేమెంట్ చేస్తే చాలు, మిగిలిన 2 నెలలకు ఇంటర్నెట్ ఉచితంగా వస్తుంది. ఇలా మొత్తం 3 నెలల పాటు ఉచితంగా ఇంటర్నెట్‌ను పొందవచ్చు. అంతేకాకుండా డిసెంబర్ 31, 2018 వరకు మరో 1000 జీబీ డేటాను ఉచితంగా అందిస్తారు.

యాక్ట్ ఫైబర్‌నెట్ సంస్థతో కలిసి షియోమీ అందిస్తున్న ఈ ఆఫర్ ఇప్పటికే అమలులోకి రాగా ఆగస్టు 31వ తేదీ వరకు ఈ ఆఫర్ కొనసాగనుంది. కేవలం హైదరాబాద్, బెంగుళూరు, ఢిల్లీ, చెన్నైలలో ఉండే వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అలాగే ఎంఐ ఆన్‌లైన్ స్టోర్, ఎంఐ హోమ్ లేదా ఫ్లిప్‌కార్ట్‌లలో ఎంఐ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీని కొంటేనే ఆఫర్ వర్తిస్తుంది. కాగా కస్టమర్లు 6 నెలల ప్లాన్ తీసుకునేటప్పుడు రూ.1299 లేదా రూ.1999 లలో ఏదైనా ఒక ప్లాన్‌ను ఎంచుకుంటేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

3799

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles