వేయికి చేరిన షియోమీ సర్వీస్ సెంటర్ల సంఖ్య..!


Wed,June 20, 2018 07:27 PM

మొబైల్స్ తయారీదారు షియోమీ నూతన మైలురాయిని సాధించింది. నగరంలో తన నూతన సర్వీస్ సెంటర్‌ను ఆ కంపెనీ లాంచ్ చేసింది. దీంతో దేశంలో ఉన్న మొత్తం షియోమీ సర్వీస్ సెంటర్ల సంఖ్య 1000కి చేరింది. వీటిలో 500 సర్వీస్ సెంటర్లలో ఎంఐ టీవీకి సర్వీస్‌ను అందిస్తున్నారు.

గతేడాది జూన్‌లో బెంగుళూరులో షియోమీ తన 500వ సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించగా వెయ్యవ సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించేందుకు ఏడాది కాలం పట్టింది. దీంతో ప్రస్తుతం దేశంలో మొత్తం 600 ప్రదేశాల్లో షియోమీ సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. వాటన్నింటిలో కలిపి 6వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా షియోమీ ఇండియా వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ మనూ జైన్ స్పందిస్తూ.. తమ కస్టమర్లకు ఉత్పత్తులను కొన్న తరువాత కూడా మరింత మెరుగ్గా సేవలను అందించేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రదేశాల్లో నూతనంగా సర్వీస్ సెంటర్లను ప్రారంభిస్తున్నామని అన్నారు. వాటిల్లో కస్టమర్లకు అత్యుత్తమ సేవలను అందిస్తున్నామని అన్నారు. సర్వీస్ సెంటర్లలో వినియోగదారులు ఎక్కువ సేపు వేచి ఉండకుండా త్వరగా పని ముగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అందుకోసం ఇ-టోకెన్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టామని తెలిపారు. దీంతోపాటు కస్టమర్ సమయాన్ని ఆదా చేసుకునేందుకు సర్వీస్ సెంటర్‌కు వెళ్లేందుకు ముందుగానే టైమ్ స్లాట్‌ను బుక్ చేసుకునే వీలు కల్పించామని అన్నారు. దీంతో కస్టమర్ల వెయిటింగ్ టైం 72 శాతం వరకు తగ్గుతుందని అన్నారు. అలాగే ఏదైనా సర్వీస్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను కూడా కస్టమర్ ఆన్‌లైన్‌లో ట్రాక్ చేసుకునేలా సదుపాయాన్ని అందిస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో తమ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

2113

More News

VIRAL NEWS