ఎల్లుండి నుంచి షియోమీ నంబర్ వన్ ఎంఐ ఫ్యాన్ సేల్


Mon,December 17, 2018 06:05 PM

మొబైల్స్ తయారీదారు షియోమీ ఈ నెల 19వ తేదీ నుంచి నంబర్ వన్ ఎంఐ ఫ్యాన్ సేల్‌ను నిర్వహించనుంది. ఈ నెల 21వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఇందులో షియోమీ స్మార్ట్‌ఫోన్లు, ఎంఐ ఎల్‌ఈడీ టీవీలు, ఇతర ఉత్పత్తులపై ఆకట్టుకునే ఆఫర్లతోపాటు రాయితీలను కూడా అందివ్వనున్నారు. ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలోనూ ఈ సేల్ కొనసాగుతుంది.

షియోమీ సేల్‌లో పోకో ఎఫ్1 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఆర్మర్డ్ ఎడిషన్ రూ.2వేల తగ్గింపుతో రూ.26,999 ధరకు లభ్యం కానుంది. అలాగే ఇదే ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ సాధారణ వేరియెంట్ కూడా రూ.2వేల తగ్గింపుతో రూ.25,999 ధరకు లభిస్తుంది. ఇక ఇదే ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.1వేయి తగ్గింపుతో రూ.21,999 ధరకు లభ్యం కానుంది. అలాగే ఎంఐ ఎ2 6జీబీర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.16,999 ధరకు, ఎంఐ ఎ2 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.14,999 ధరకు లభ్యం కానున్నాయి. రెడ్‌మీ నోట్ 5 ప్రొ 6జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.14,999 ధరకు, నోట్ 5 ప్రొ 4జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.12,999 ధరకు, రెడ్‌మీ వై2 4జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.10,999 కు, 3జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.8,999 ధరకు లభ్యం కానున్నాయి.

షియోమీ సేల్‌లో ఎంఐ ఎల్‌ఈడీ టీవీ 4ఎ ప్రొ (49 ఇంచెస్) రూ.1వేయి తగ్గింపుతో రూ.30,999 ధరకు లభ్యం కానుంది. అలాగే ఎంఐ ఎల్‌ఈడీ టీవీ 4ఎ (43 ఇంచెస్) రూ.21,999 ధరకు, ఎంఐ ఎల్‌ఈడీ టీవీ 4సి ప్రొ (32 ఇంచెస్) రూ.14,999 ధరకు లభ్యం కానున్నాయి. అదేవిధంగా సేల్‌లో భాగంగా ప్రతి రోజూ సాయంత్రం 4 గంటలకు ఐటమ్స్‌ను కొనుగోలు చేస్తే రూ.50, రూ.100, రూ.200, రూ.500 విలువైన కూపన్లు ఇస్తారు. మొబిక్విక్ యూజర్లకు 10 శాతం ఇన్‌స్టంట్ సూపర్ క్యాష్ వస్తుంది. గూగుల్ పే యూజర్లు రూ.500 వరకు రివార్డులు గెలుచుకోవచ్చు. పేటీఎం యూజర్లకు రూ.300 క్యాష్‌బ్యాక్ ఇస్తారు.

3107
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles