ఎంఐ టీవీ 4ఏ (40 ఇంచ్) స్మార్ట్‌టీవీని లాంచ్ చేసిన షియోమీ..!


Mon,March 5, 2018 01:45 PM

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు షియోమీ తన నూతన స్మార్ట్ టీవీ మోడల్ ఎంఐ టీవీ 4ఏ (40 ఇంచ్)ను ఇవాళ చైనాలో విడుదల చేసింది. భారత్‌లో ఈ టీవీని ఈ నెల 7వ తేదీన విడుదల చేయనున్నారు. దీని ధర రూ.17,500 మాత్రమే ఉండే అవకాశం ఉంది. కాగా షియోమీ ఎంఐ టీవీ 4ఏ లో 40 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, వాయిస్ కంట్రోల్ సపోర్ట్, వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, హెచ్‌డీఎంఐ, ఈథర్‌నెట్ పోర్టులు, డాల్బీ డీటీఎస్ ఆడియో, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్ తదితర ఫీచర్లు ఉన్నాయి.

3433

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles