వచ్చేసింది.. రూ.14వేలకే షియోమీ 32 ఇంచుల ఎంఐ ఆండ్రాయిడ్ టీవీ..!


Wed,March 7, 2018 04:11 PM

చైనాకు చెందిన మొబైల్స్ తయారీ సంస్థ షియోమీ ఇటీవలే 55 ఇంచుల ఎంఐ టీవీ4ను విడుదల చేసిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఈటీవీకి వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. దాన్ని దృష్టిలో ఉంచుకుని మరో రెండు టీవీలను షియోమీ తక్కువ ధరకే లాంచ్ చేసింది. ఎంఐ టీవీ 4ఏ పేరిట 32, 43 ఇంచుల వేరియెంట్లలో నూతన స్మార్ట్‌టీవీలను షియోమీ కొంత సేపటి క్రితమే లాంచ్ చేసింది. ఈ రెండు టీవీలు వరుసగా రూ.13,999, రూ.22,999 ధరలకు వినియోగదారులకు లభిస్తున్నాయి. వీటిని ఎంఐ ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్ స్టోర్‌లలో ఈ నెల 13వ తేదీ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇవే టీవీలు ఈ నెల 16వ తేదీ నుంచి ఎంఐ హోమ్ స్టోర్స్‌లోనూ లభ్యం కానున్నాయి. ప్రతి వారంలో రెండు సార్లు మంగళవారం, శుక్రవారాలలో ఈ టీవీలకు ఫ్లాష్ సేల్‌ను నిర్వహిస్తారు. ఇక ఈ టీవీ కొన్న జియోఫై వినియోగదారులకు రూ.2200 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

షియోమీ ఎంఐ టీవీ 4ఏ 32 ఇంచ్ మోడల్‌లో 32 ఇంచుల హెచ్‌డీ డిస్‌ప్లే, 1366 x 768 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ ఓఎస్, వైఫై, హెచ్‌డీఎంఐ, ఏవీ, యూఎస్‌బీ 2.0, ఈథర్‌నెట్, ఎస్/పీడీఐఎఫ్ పోర్టులు, డీటీఎస్ ఆడియో ఫీచర్లు ఉన్నాయి.

Xiaomi-Mi-TV-4A-43

షియోమీ ఎంఐ టీవీ 4ఏ 43 ఇంచ్ మోడల్‌లో 43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ ఓఎస్, వైఫై, హెచ్‌డీఎంఐ, ఏవీ, యూఎస్‌బీ 2.0, ఈథర్‌నెట్, ఎస్/పీడీఐఎఫ్ పోర్టులు, డాల్బీ వర్చువల్ సరౌండ్ సౌండ్, డీటీఎస్ ఆడియో ఫీచర్లు ఉన్నాయి.

7117

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles