రూ.40వేలకే షియోమీ 55 ఇంచుల 4కె హెచ్‌డీఆర్ టీవీ..!


Wed,February 14, 2018 04:35 PM

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు షియోమీ తన నూతన ఎంఐ టీవీ మోడల్ ఎంఐ టీవీ4ను భారత్‌లో తాజాగా విడుదల చేసింది. గతేడాది జరిగిన కన్‌జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2017 లో ఈ టీవీని షియోమీ ప్రదర్శించింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ టీవీని షియోమీ లాంచ్ చేసింది. ఇందులో హెచ్‌డీఆర్ సపోర్ట్ ఉన్న అధునాతన 4కె ప్యానెల్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీని వల్ల ఈ టీవీలో కనిపించే దృశ్యాలు అత్యంత క్వాలిటీతో కూడుకుని ఉంటాయి. ఇక ఈ టీవీతోపాటు స్మార్ట్ రిమోట్‌ను అందిస్తున్నారు. దీని ద్వారా సెట్ టాప్ బాక్స్‌ను కూడా ఆపరేట్ చేసుకోవచ్చు.

షియోమీ ఎంఐ టీవీ4లో 55 ఇంచ్ 4కె డిస్‌ప్లే, 3840 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ ఆధారిత ఎంఐయూఐ టీవీ ఓఎస్, వైఫై, బ్లూటూత్ 4.0 ఎల్‌ఈ, హెచ్‌డీఎంఐ, ఈథర్‌నెట్ పోర్టులు, డాల్బీ డీటీఎస్ ఆడియో వంటి ఫీచర్లు ఉన్నాయి. రూ.39,999 ధరకు ఈ టీవీ ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కామ్, ఎంఐ హోమ్ స్టోర్స్‌లో వినియోగదారులకు ఈ నెల 22వ తేదీ నుంచి లభ్యం కానుంది. టీవీని కొన్నవారికి 3 నెలల పాటు సోనీ లివ్, హంగామా యాప్‌లలో ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందివ్వనున్నారు. అలాగే ఉచిత ఇన్‌స్టాలేషన్, ఉచిత ఎంఐ ఐఆర్ కేబుల్‌ను అందిస్తున్నారు.

6248

More News

VIRAL NEWS