ఎంఐ సౌండ్ బార్‌ను విడుద‌ల చేసిన షియోమీ


Thu,January 10, 2019 02:51 PM

మొబైల్స్ త‌యారీదారు షియోమీ.. ఎంఐ సౌండ్ బార్‌ను ఇవాళ భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. రూ.4,999 ధ‌ర‌కు ఈ సౌండ్ బార్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది. దీన్ని బ్లూటూత్ ద్వారా ఇత‌ర డివైస్‌ల‌కు క‌నెక్ట్ చేసుకోవ‌చ్చు. అలాగే లైనిన్‌, ఆక్స్‌, ఆప్టికల్ అండ్ ఎస్/పీడీఐఎఫ్ ఇన్‌పుట్ ఆప్ష‌న్ల‌ను ఇందులో అందిస్తున్నారు. మొద‌టి సారి ఈ సౌండ్ బార్‌ను సెట‌ప్ చేసేందుకు కేవ‌లం 30 సెక‌న్ల స‌మ‌యం మాత్ర‌మే ప‌డుతుంద‌ని షియోమీ చెబుతున్న‌ది. ఈ నెల 16వ తేదీ నుంచి ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌, ఎంఐ హోమ్ స్టోర్స్‌లో ఈ సౌండ్ బార్‌ను విక్ర‌యించ‌నున్నారు.

1466
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles