షియోమీ ఎంఐ ప్యాడ్ 4 ప్లస్ ట్యాబ్లెట్ పీసీ విడుదల


Tue,August 14, 2018 11:05 AM

మొబైల్స్ తయారీదారు షియోమీ తన నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ పీసీ ఎంఐ ప్యాడ్ 4 ప్లస్‌ను తాజాగా విడుదల చేసింది. 64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో ఈ ట్యాబ్లెట్ పీసీ ఈ నెల 16వ తేదీ నుంచి చైనా మార్కెట్‌లో వినియోగదారులకు లభ్యం కానుంది. తరువాత భారత్‌లోనూ ఈ ట్యాబ్లెట్ పీసీ లభిస్తుంది. రూ.19,280, రూ.21,310 ధరలకు వినియోగదారులకు లభ్యం కానుంది.

షియోమీ ఎంఐ ప్యాడ్ 4 ప్లస్ ఫీచర్లు...
10.1 ఇంచ్ డిస్‌ప్లే, 1920 x 1200 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, 4జీ ఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 8620 ఎంఏహెచ్ బ్యాటరీ.

1685

More News

VIRAL NEWS