ఎంఐ నోట్‌బుక్ ఎయిర్ 13.3, 15.6 ఇంచ్ ల్యాప్‌టాప్‌లు విడుదల


Wed,November 14, 2018 12:50 PM

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు షియోమీ.. ఎంఐ నోట్‌బుక్ ఎయిర్ నూతన వేరియెంట్లను తాజాగా చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. వీటిల్లో ఇంటెల్ 8వ జనరేషన్ కోర్ ఐ3 ప్రాసెసర్లను ఏర్పాటు చేశారు. 13.3, 15.6 ఇంచ్ వేరియెంట్లలో ఈ ల్యాప్‌టాప్‌లు లభిస్తున్నాయి. వీటిల్లో గరిష్టంగా 8జీబీ ర్యామ్‌కు సపోర్ట్‌ను ఇస్తున్నారు. అలాగే ఫాస్ట్ చార్జింగ్ యూఎస్‌బీ టైప్ సి పోర్ట్, 128 జీబీ ఎస్‌ఎస్‌డీ, విండోస్ 10 హోం ఎడిషన్, డ్యుయల్ బ్యాండ్ వైఫై తదితర ఫీచర్లను ఈ ల్యాప్‌టాప్‌లలో అందిస్తున్నారు. 13.3 ఇంచ్ ఎంఐ నోట్‌బుక్ ఎయిర్ ప్రారంభ ధర రూ.35,500 ఉండగా, 15.6 ఇంచ్ మోడల్ ప్రారంభ ధర రూ.41,700 గా ఉంది.

1292

More News

VIRAL NEWS