ఈ నెల 19న విడుదల కానున్న షియోమీ ఎంఐ మ్యాక్స్ 3


Thu,July 12, 2018 10:03 AM

మొబైల్స్ తయారీదారు షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎంఐ మ్యాక్స్ 3 ని ఈ నెల 19వ తేదీన చైనా మార్కెట్‌లో విడుదల చేయనుంది. తరువాత భారత్‌లోనూ ఈ ఫోన్ విడుదలవుతుంది. ఈ ఫోన్ ధర వివరాలను షియోమీ ఇంకా వెల్లడించలేదు. కానీ బ్లాక్, గ్రే, గోల్డ్, రోజ్ గోల్డ్ తదితర వేరియెంట్లలో ఈ ఫోన్ విడుదల కానున్నట్టు తెలిసింది. ఇక ఈ ఫోన్‌లో పలు ఆకట్టుకునే ఫీచర్లను యూజర్లకు అందివ్వనున్నారు.

షియోమీ ఎంఐ మ్యాక్స్ 3 ఫీచర్లు...
6.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 5400 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.

1246

More News

VIRAL NEWS