రూ.40వేల‌కే షియోమీ 55 ఇంచుల కొత్త 4కె టీవీ


Thu,January 10, 2019 01:03 PM

మొబైల్స్ త‌యారీదారు షియోమీ త‌న నూత‌న ఎంఐ ఎల్ఈడీ టీవీలను ఇవాళ భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎ ప్రొ 43, ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎక్స్ ప్రొ 55 4కె టీవీల‌ను వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి తెచ్చింది. వీటిల్లో 20 వాట్ల స్టీరియో స్పీక‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. గూగుల్ వాయిస్ సెర్చ్ ఫీచ‌ర్‌ను వీటిల్లో అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్‌ను ఈ టీవీల‌లో అందిస్తున్నారు. ప్లే స్టోర్‌, క్రోమ్ క్యాస్ట్‌కు స‌పోర్ట్‌, హాట్ స్టార్‌, హంగామా, సోనీ లివ్‌, వూట్‌, ఈరోస్ నౌ, జీ5, హూక్‌, ఎపిక్ ఆన్ వంటి యాప్‌లు ఇన్‌బిల్ట్‌గా వీటిల్లో ల‌భిస్తున్నాయి.

షియోమీ ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎ ప్రొ 43 ఇంచ్ టీవీలో 1920 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్‌, వైఫై, హెచ్‌డీఎంఐ, యూఎస్‌బీ పోర్టులు త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. అలాగే షియోమీ ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎక్స్ ప్రొ 55 ఇంచ్ టీవీలో 3840 x 2160 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్‌, 8 జీబీ స్టోరేజ్‌, వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, యూఎస్‌బీ, హెచ్‌డీఎంఐ పోర్టులు, డీటీఎస్ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఇక 43 ఇంచుల టీవీ ధ‌ర రూ.22,999 ఉండ‌గా, 55 ఇంచుల టీవీ ధ‌ర రూ.39,999 గా ఉంది. ఈ నెల 15వ తేదీన మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్ ల‌లో ఈ టీవీల‌ను విక్ర‌యించ‌నున్నారు.

3148
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles