4కె హెచ్‌డీఆర్ ఆండ్రాయిడ్ టీవీ బాక్స్‌ను విడుదల చేసిన షియోమీ


Sun,October 14, 2018 12:45 PM

మొబైల్స్ తయారీదారు షియోమీ.. ఎంఐ బాక్స్ ఎస్ పేరిట ఓ నూతన ఆండ్రాయిడ్ టీవీ బాక్స్‌ను విడుదల చేసింది. 4కె హెచ్‌డీఆర్ రిజల్యూషన్‌కు ఇందులో సపోర్ట్‌ను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 8.1 ఆధారంగా ఈ బాక్స్ పనిచేస్తుంది. దీంతోపాటు ఓ వాయిస్ రిమోట్‌ను కూడా అందిస్తున్నారు. దానిపై నెట్‌ఫ్లిక్స్ షార్ట్‌కట్, అసిస్టెంట్ బటన్, యాప్ షార్ట్‌కట్ ఉంటాయి. ఈ బాక్స్‌లో గూగుల్ అసిస్టెంట్‌కు సపోర్ట్‌ను అందిస్తున్నారు. దీని వల్ల వాయిస్ కమాండ్లతో సెర్చ్ చేసుకోవచ్చు. ఇందులో ఇన్‌బిల్ట్ క్రోమ్‌క్యాస్ట్ సదుపాయం ఉంది.

షియోమీ ఎంఐ బాక్స్ ఎస్ డివైస్‌లో క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. ప్లే స్టోర్‌లో యాప్స్, గేమ్స్‌ను డౌన్‌లోడ్ చేసుకునే వీలు ఇందులో కల్పించారు. ఈ బాక్స్‌లో 2 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, డాల్బీ డిజిటల్ ప్లస్, డీటీఎస్ సరౌండ్ సౌండ్, బ్లూటూత్, డ్యుయల్ బ్యాండ్ వైఫై, హెచ్‌డీఎంఐ తదితర ఫీచర్లను అందిస్తున్నారు. రూ.4,445 ధరకు ఈ బాక్స్ వినియోగదారులకు నవంబర్ నెలలో లభ్యం కానుంది.

3047

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles