ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్‌ను విడుదల చేసిన షియోమీ


Tue,June 25, 2019 09:16 PM

మొబైల్స్ తయారీదారు షియోమీ.. ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్‌ను ఇవాళ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో 40 రకాల సైజుల్లో గడ్డం వెంట్రుకలను ట్రిమ్ చేసుకునేందుకు వీలుగా సెట్టింగ్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ ట్రిమ్మర్‌కు వాటర్ ప్రూఫ్ సదుపాయం కూడా ఉంది. ఒక్కసారి దీన్ని ఫుల్ చార్జింగ్ చేస్తే 90 నిమిషాల వరకు వాడుకోవచ్చు. దీనికి 2 రకాల బియర్డ్ కోంబ్‌లను అందిస్తున్నారు. 0.5 నుంచి 20 ఎంఎం సైజ్ వరకు గడ్డం వెంట్రుకలను కత్తిరించుకోవచ్చు. ఈ ట్రిమ్మర్‌ను 5 నిమిషాల పాటు చార్జింగ్ చేస్తే 10 నిమిషాల సమయం పాటు ఉపయోగించుకోవచ్చు. అలాగే కేబుల్‌తోనూ దీన్ని వాడుకోవచ్చు. ఇక ఈ ట్రిమ్మర్‌ను రూ.1199 ధరకు విక్రయిస్తున్నారు. ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లో దీన్ని ఆర్డర్ చేయవచ్చు. ఈ నెల 27వ తేదీ నుంచి ఈ ట్రిమ్మర్‌ను అమెజాన్ వెబ్‌సైట్‌తోపాటు ఎంఐ హోం స్టోర్స్‌లోనూ విక్రయించనున్నారు.

3023
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles