ఎంఐ బ్యాండ్ 4ను విడుదల చేసిన షియోమీ


Tue,June 11, 2019 06:14 PM

మొబైల్స్ తయారీదారు షియోమీ తన నూతన స్మార్ట్‌బ్యాండ్.. ఎంఐ బ్యాండ్ 4 ను ఇవాళ చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో 0.95 ఇంచుల అమోలెడ్ కలర్ టచ్ స్క్రీన్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. అంతకు ముందు వచ్చిన ఎంఐ బ్యాండ్ 3 కన్నా ఈ బ్యాండ్ డిస్‌ప్లే 39.9 శాతం పెద్దదిగా ఉంటుంది. అలాగే ఎంఐ బ్యాండ్ 4 లో స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్‌ను ఏర్పాటు చేశారు. దీనికి 5 ఏటీఎం వాటర్ రెసిస్టెంట్ ఫీచర్‌ను అందిస్తున్నారు. అందువల్ల నీటిలో 50 మీటర్ల లోతులోనూ ఈ బ్యాండ్ పనిచేస్తుంది.

ఎంఐ బ్యాండ్ 4 లో 6 రకాల స్పోర్ట్స్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. దీంతో స్విమ్మింగ్ సహా 6 రకాల స్పోర్ట్స్ యాక్టివిటీలను ట్రాక్ చేయవచ్చు. అలాగే ఇందులో షియో ఏఐ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌ను ఏర్పాటు చేశారు. ఇక ఈ బ్యాండ్‌కు చెందిన అవెంజర్స్ ఎడిషన్, కెప్టెన్ అమెరికా, అవెంజర్స్ ఐరన్ మ్యాన్ ఎడిషన్లను కూడా విక్రయించనున్నారు. ఈ బ్యాండ్‌లో హార్ట్ రేట్ సెన్సార్, స్లీప్ ట్రాకర్, సెడెంటరీ రిమైండర్, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, స్మార్ట్‌ఫోన్ నోటిఫికేషన్స్ తదితర ఫీచర్లను కూడా అందిస్తున్నారు. అలాగే ఇందులో 135 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేసినందున ఈ బ్యాండ్ 20 రోజుల వరకు నాన్‌స్టాప్‌గా పనిచేస్తుంది.

షియోమీ ఎంఐ బ్యాండ్ 4 ను రూ.1695 ధరకు ఈ నెల 16వ తేదీ నుంచి విక్రయించనున్నారు. ఇతర ఎడిషన్లను రూ.3500 ధరకు విక్రయిస్తారు.

2250
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles