షియోమీ ఎంఐ బ్యాండ్ 2 తగ్గింపు ధరతో మళ్లీ సేల్ షురూ..!


Tue,February 27, 2018 05:55 PM

మొబైల్స్ తయారీదారు షియోమీ గతేడాది సెప్టెంబర్‌లో ఎంఐ బ్యాండ్ 2 ఫిట్‌నెస్ ట్రాకర్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ బ్యాండ్ ధర రూ.1999 గా ఉండేది. కానీ రూ.200 తగ్గింపుతో ఇప్పుడీ బ్యాండ్‌ను రూ.1799 ధరకే విక్రయిస్తున్నారు. అమెజాన్, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లలో ఈ బ్యాండ్‌ను యూజర్లు కొనుగోలు చేయవచ్చు. అప్పట్లో ఈ బ్యాండ్‌కు నిర్వహించిన సేల్‌లో దీన్ని చాలా మంది యూజర్లు కొనుగోలు చేశారు. దీంతో ఈ బ్యాండ్‌ను షియోమీ ఇప్పటి వరకు మళ్లీ విక్రయించలేదు. అయితే నేటి నుంచి ఈ బ్యాండ్‌కు మళ్లీ విక్రయాలను ప్రారంభించారు.

షియోమీ ఎంఐ బ్యాండ్ 2లో 0.42 ఇంచ్ ఓలెడ్ డిస్‌ప్లే, స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్‌, యాంటీ ఫింగ‌ర్‌ప్రింట్ కోటింగ్‌, స్టెప్, హార్ట్ రేట్ సెన్సార్లు, ఐపీ67 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, బ్లూటూత్ 4.0 ఎల్ఈ, 70 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 20 రోజుల బ్యాట‌రీ బ్యాక‌ప్ వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి. ఈ బ్యాండ్‌ను చేతికి ధ‌రిస్తే దాంతో ఫిట్‌నెస్‌, నిద్ర, ఇత‌ర యాక్టివిటీల‌ను ట్రాక్ చేసుకోవ‌చ్చు. కేవ‌లం 7 గ్రాముల బ‌రువును మాత్ర‌మే ఈ బ్యాండ్ క‌లిగి ఉంది.

3646

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles