ఈ ట్రాన్స్‌లేటర్ 34 భాషలను రియల్‌టైంలో తర్జుమా చేస్తుంది..!


Thu,June 13, 2019 05:53 PM

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు షియోమీ తాజాగా ఎంఐ ఏఐ ట్రాన్స్‌లేటర్‌ను లాంచ్ చేసింది. ఇందులో ఆక్స్‌ఫర్డ్, కొలిన్స్ డిక్షనరీలు ప్రీ ఇన్‌స్టాల్డ్‌గా లభిస్తున్నాయి. అలాగే మరో 3 చైనీస్ డిక్షనరీలను కూడా ఈ డివైస్‌లో ఏర్పాటు చేశారు. దీంతో ఇంగ్లిష్ పదాలను సరిగ్గా ఎలా ఉచ్ఛరించాలో నేర్చుకోవచ్చు. అలాగే చైనీస్, ఇంగ్లిష్, జపనీస్, కొరియన్, జర్మన్ భాషలకు ఇందులో ఆఫ్‌లైన్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌ను కూడా అందిస్తున్నారు.

ఇక ఈ ట్రాన్స్‌లేటర్ ద్వారా 224 దేశాల ప్రజలు మాట్లాడే 34 భాషలను రియల్ టైంలో తర్జుమా చేసుకోవచ్చు. కాగా ఈ డివైస్‌కు గాను 4జీ వెర్షన్‌ను కూడా అందిస్తున్నారు. దాంట్లో 4జీ సిమ్ వేసుకుంటే వైఫై హాట్‌స్పాట్ షేరింగ్ ఫీచర్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ డివైస్ వెనుక భాగంలో 5 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. దీంతో క్లోజప్ షాట్స్ తీసుకోవచ్చు.

షియోమీ ఎంఐ ఏఐ ట్రాన్స్‌లేటర్‌లో 4 ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్‌ప్లే, 2 గిగాహెడ్జ్ మల్టీ కోర్ ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/64 జీబీ స్టోరేజ్, 4జీ, వైఫై, 5 మెగాపిక్సల్ కెమెరా, బ్లూటూత్, డ్యుయల్ మైక్రోఫోన్స్, లౌడ్ స్పీకర్, 2200 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 రోజుల స్టాండ బై టైం తదితర ఫీచర్లను అందిస్తున్నారు. కాగా ఈ డివైస్ బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో విడుదల కాగా ప్రస్తుతం ఇది చైనాలోనే లభిస్తున్నది. ఈ నెల 19వ తేదీ నుంచి ఈ డివైస్‌ను రూ.5వేల ప్రారంభ ధరకు విక్రయించనున్నారు.

2068
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles